Friday, 15 May 2026

నా పై దుష్ప్రచారాలు, అవాస్తవాలు సరికావు – ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య

 సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అవాస్తవ ప్రచారాలను ఖండిస్తూ ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు... thumbnail 1 summary


 సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అవాస్తవ ప్రచారాలను ఖండిస్తూ ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు.

గత సంవత్సరం ఆగస్టులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో తాను ఏఎంసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సూచనల మేరకు 25-11-2025న వ్యవసాయ మార్కెట్ యార్డులో తొలి సమావేశం నిర్వహించి, సెక్రటరీ రామాంజనేయులు ప్రతిపాదించిన 103 అంశాలకు ఆమోదం తెలుపుతూ రూ.11.35 కోట్ల వ్యయంతో రైతు బజార్ ఆధునీకరణ, కాంపౌండ్ వాల్, లింక్ రోడ్ల నిర్మాణాలకు తీర్మానాలు చేసినట్లు వివరించారు.

అలాగే 24-02-2026న జరిగిన రెండో సమావేశంలో అంశాలను 131కు పెంచి రూ.12.96 కోట్ల అజెండాకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. అయితే ఇప్పటివరకు ఆ పనులకు సంబంధించి ఎలాంటి నిధులు విడుదల కాలేదని తెలిపారు.

2016లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.17 ప్రకారం ఏఎంసీ ఆదాయంలో 20 శాతం వరకు మాత్రమే వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రభుత్వం వద్ద నిధులు సమకూరుస్తామని హామీ ఇవ్వడంతోనే అజెండాను రూ.12.96 కోట్లకు పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏఎంసీ ఆదాయం సుమారు రూ.18 కోట్ల వరకు మాత్రమే ఉందని పేర్కొన్నారు.


06-05-2026న నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి కొందరు డైరెక్టర్లు హాజరుకాకపోవడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. అనంతరం 14-05-2026న జరిగిన సమావేశంలో మార్కెట్ యార్డు కాంపౌండ్ వాల్, గోడౌన్ల మరమ్మత్తులకు రూ.96 లక్షల ప్రతిపాదనలను కమిటీ ముందుకు తీసుకువచ్చినట్లు తెలిపారు.ఈ రూ.96 లక్షల ప్రతిపాదనను తానే ప్రత్యేకంగా చేర్చలేదని,నా సొంత ప్రతిపాదనలు ఏమి లేదు, అభివృద్ధి పనుల నిమిత్తమే ఏఎంసీ సెక్రటరీ జగదీష్ సూచనల మేరకు అడ్మినిస్ట్రేషన్ పరిధిలో చేపట్టవచ్చని అజెండాలో చేర్చినట్లు స్పష్టం చేశారు. గత సమావేశాల్లో చర్చించిన అంశాలనే తిరిగి కమిటీ ముందుకు తీసుకువచ్చినట్లు తెలిపారు.

తాను ఎప్పుడూ ఎమ్మెల్యే సూచనల మేరకే పనిచేశానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎక్కడా వ్యవహరించలేదని అలేఖ్య స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నిలిపివేయాలని కోరుతూ, ఇకపై ఇలాంటి అవాస్తవ కథనాలు ప్రచారం నిలిపివేయాలని కోరారు. 

- సీనియర్ జర్నలిస్ట్, జయప్రతాప్ రెడ్డి, నెల్లూరు.


No comments

Post a Comment

BTemplates.com